ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా మంచి పాటలు రిలీజ్ చేస్తూ ఎమోషన్ ని పెంచుతున్న సినిమాలో, ఈరోజు టైటిల్ సాంగ్ ని వదిలారు.
రామ్ మిర్యాల గాత్రం ఈ సాంగ్ కి ఎమోషనల్ వైబ్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కాశ్యప్ కంపోజ్ చేసిన ఈ పాటలో కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ తో పాత వెంటనే వైరల్ అయ్యింది… అలానే ఇక పాత కాన్సెప్ట్ లో మనకి సినిమా స్టోరీ తెలిసిపోయింది.
ఇక్కడ హీరో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు… కానీ అతనికి నైట్ షిఫ్ట్, ఈమెకి మార్నింగ్ షిఫ్ట్… వీక్ డేస్ అంత అలానే గడిచిపోతాయి… వీకెండ్ వచ్చేసరికి రొమాన్స్. ఇది కథ… ఇక్కడి వరకు ఓకే… కానీ పిల్లలు కావలి అనేసరికి వస్తుంది ప్రాబ్లెమ్… ఒక వైపు చెక్ అప్స్, ఇంకో వైపు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్కోవడం… అన్ని చేస్తూ పిల్లలు ఎప్పుడు పుడతారా అని వెయిటింగ్… అక్కడ మళ్ళి గొడవలు… అబ్బో ఇది మన జనరేషన్ లో కామన్ ప్రాబ్లెమ్ కదా… కానీ పాట లో బాగా చూపించారు…
విక్రాంత్ – చాందిని చౌదరి నిజమైన పెళ్లైన జంటలా కనిపిస్తూ హార్ట్ టచ్ అయ్యారు.
ఈ సినిమా కి సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికే అద్భుత స్పందన తెచ్చుకుంది.
అలాగే చిత్రంలో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్ లు చేసే కామెడీతో థియేటర్ లో నవ్వులు పూయేలా ఉంది.
‘ABCD’, ‘ఆహా నా పెళ్లంట’ ఫేమ్ సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, స్క్రీన్‌ప్లేను శేఖ్ దావూద్ జీ రాశారు.
ఈ హార్ట్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.