సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది… సెప్టెంబర్ లో వచ్చిన మిరాయి, లిటిల్ హార్ట్స్, కిష్కింధపూరి ఇంకా పవన్ OG సినిమాలు అద్భుతంగా ఆడాయి… ఇక అక్టోబర్ లో అంత కాంతారా మాయ. ఇక ఇప్పుడు నవంబర్ లో సుధీర్ బాబు సోనాక్షి ల జటాధరా సినిమా అలంటి మేజిక్ రిపీట్ చేస్తుంది అంటున్నారు అందరు…
సినిమా రిలీజ్ ఇంకో రెండు రోజుల్లో ఉంది కాబట్టి, నిర్మాతలు రిలీజ్ ట్రైలర్ కూడా లాంచ్ చేసి సూపర్ అనిపించి అంచనాలు ఇంకా పెంచేశారు. నవంబర్ 7న సినిమా థియేటర్లలోకి రానుండగా… కేవలం రెండు రోజుల ముందే ఈ ట్రైలర్ బిగ్ సర్ప్రైజ్ గా వచ్చింది.
ఇందులో హీరో ఓ గోస్ట్ హంటర్. మనుషుల లోభం నుంచి పుట్టిన భయంకరమైన శక్తి ధన పిశాచిని ఆపాలని బయలుదేరతాడు. ప్రపంచం నాశనం కాకుండా చేయడానికి… తన ప్రాణం కోల్పోవడానికైనా సిద్ధపడతాడు. కానీ ఆ అల్లకల్లోలం అతని చేతుల్లో ఆగదు… అప్పుడు కలియుగంలో శివుడు అవతరించినట్టు కనిపిస్తూ, దివ్య శక్తిగా దేవుడు స్వయంగా దిగివస్తాడు.
రిలీజ్ ట్రైలర్… నిజంగానే ఒక శక్తి లా దూసుకొచ్చింది. శక్తివంతమైన విజువల్స్, భావోద్వేగం, రక్తం ఉరకలేసే ఎనర్జీ — థియేటర్‌లో సీటు కి అత్తుకుపోయేలా ఉంది. సుధీర్ బాబు గోస్ట్ హంటర్‌గా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాడు. ఇక సోనాక్షి సిన్హా భయపడేలా, ఉన్న ధన పిశాచి పాత్రలో అద్భుతంగా మెరిసింది.