దుల్కర్ సల్మాన్ మరో పీరియాడిక్ డ్రామా తో రెడీ గా ఉన్నాడు… కాంత తో మనన్ని ఆ పాత కాలం సినిమా లోకానికి తీసుకెళ్లనున్నాడు… సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ఈరోజే రెబెల్ స్టార్ ప్రభాస్ కాంత ట్రైలర్ లాంచ్ చేసాడు.
నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ పీరియడ్ డ్రామా ఇప్పుడే సినీప్రపంచం అంతా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది…
కాంతా కథ ఒక అభిరుచి కల నటుడు, అతనికి మార్గదర్శకుడైన గురువు మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణం. ఒక కలల ప్రాజెక్ట్ — కాంతా చుట్టూ ఇద్దరి జీవితం తిరుగుతుంది. మొదట స్నేహంగా మొదలైన ఈ ప్రయాణం, క్రమంగా అహంకారానికి, ఆశలకు, సృజనాత్మకతకు మధ్య యుద్ధంగా మారుతుంది. కీర్తి కోసం తపన, కళ కోసం ఉన్న నిబద్ధత — వీటన్నింటి మధ్య నడిచే మనసుల ఘర్షణనే ఈ సినిమా చూపిస్తుంది.
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథను ఎంతో నెమ్మదిగా, హృదయాన్ని తాకేలా అల్లారు.
దుల్కర్ సల్మాన్ నటన ఈ సినిమాలో ప్రధాన బలంగా నిలిచింది. ఒక ఆశతో నిండిన యువ నటుడిగా మొదలై, గర్వం తో నిండిన సూపర్‌స్టార్‌గా మారే ప్రయాణంలో ఆయన నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. సముద్రకని గురువు పాత్రలో తన హావభావాలతో హృదయాలను ఆకర్షిస్తాడు. ఇక రానా దగ్గుబాటి పోలీస్ ఆఫీసర్‌గా ప్రవేశించి, కథలో సీరియస్ టోన్‌ను పెంచుతాడు.
డానీ సాంచెజ్ లోపెజ్ తీసిన బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలు సినిమాకు ఒక క్లాసిక్ పీరియడ్ ఫీల్ తెస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ రామలింగం 60–70 దశకాల సినిమా ప్రపంచాన్ని నిజంగా ప్రేక్షకుల ముందుకు తెస్తాడు. సంగీత దర్శకుడు ఝాను చాంతర్ ప్రతి ఘర్షణను, ప్రతి భావాన్ని తన మ్యూజిక్‌తో మరింతగా ఎత్తిపడేస్తాడు.