RRR తరవాత మన రామ్ చరణ్ కి అంత పెద్ద హిట్ సినిమా పడలేదు… అయ్యో ఎలాగా ఎనుకుంటుండగా, బుచ్చి బాబు సన తో ‘పెద్ది’ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఒక కంప్లీట్ village డ్రామా అని, దాంట్లో మన చరణ్ రంగస్థలం లో ఎలా ఉండేవాడో ఆలా ఉంటాడు అని అందరు అన్నారు…
ఇక మొన్న సినిమా నుంచి ఫస్ట్ షాట్ రిలీజ్ అవ్వగానే అబ్బో క్రికెట్ సినిమా లో మన చరణ్ బాగా ఉన్నాడు అని అన్నారు… కానీ కథ మారిందండోయ్… ఈరోజు “చికిరి చికిరి…” అని చరణ్ మన తో స్టెప్స్ వేయించుతున్నాడు…
ఎందుకంటే ‘పెద్ది’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రమోతోనే సోషల్ మీడియా మొత్తం హీట్ అయ్యింది. ఇప్పుడు పూర్తి పాటను విడుదల చేసిన మేకర్స్… ఒక పాన్ ఇండియా సెన్సేషన్‌ను సృష్టించేలా చేశారు.
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. ఈ పాటలోని బీట్స్ గ్రామీణ సౌండ్స్‌తో పాటు ఎనర్జిటిక్ వైబ్స్‌ను పంచుతున్నాయి. మోహిత్ చౌహాన్ తన వాయిస్ తో పెద్ద మేజిక్ చేసాడు మరి…
ఇక ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. ఆయన డాన్స్ మూమెంట్స్‌లో రెహ్మాన్ రిథమ్‌కు చరణ్ సూపర్ గా చేసాడు. ఒక్కో స్టెప్ కూడా కథ చెబుతున్నట్టు ఉంటుంది.
బీడీ చేతిలో పట్టుకుని రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ఇప్పుడే వైరల్ అవుతోంది. ఆయన ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూవ్స్ — ప్రతిదీ మామూలుగా లేవు! ఎందుకంటే ఎందుకు ఆయనను ఇండియన్ సినిమాల్లో బెస్ట్ డ్యాన్సర్స్‌లో ఒకరిగా పిలుస్తారో మరోసారి నిరూపించారు. జాన్వీ కపూర్ కూడా గ్రామీణ లుక్‌లో అద్భుతంగా మెరిసింది. ఇక జాన్వీ కపూర్ కూడా పల్లెటూరి పిల్ల లాగ సూపర్ గా ఉంది… ఆ అందాలకు చరణ్ ఫిదా అయ్యాడు మరి. ఇక ఆల్రెడీ పాపులర్ అయినా సిక్సర్ స్టెప్ కూడా సూపర్ గా ఉంది…
పెద్దు సినిమా మార్చి 27న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.