మన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలా??? ఇక అయన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బ్లాక్బస్టర్ గ్యారెంటీ! ఇప్పటి వరకూ ఈ జోడి చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమాపై అభిమానుల్లో అసాధారణమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ప్రమోలు సినిమాపై హైప్ ను ఆకాశానికి ఎత్తేశాయి. ఇక తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ “ది తాండవం” సాంగ్ ప్రమోను విడుదల చేశారు.
ప్రమోలో బాలయ్య ఒక ఆలయంలో ఆఘోర అవతారంలో కనిపించాడు. శివుడి తాండవం చేస్తూ అఘోర రూపంలో ఆయన చూపించిన ఫెరోషియస్ లుక్, ఆరాధనాత్మక ఉత్సాహంతో ఉన్న ఆఘోరాల నడుమ కనిపించే ఆ విజువల్స్ — అన్నీ సూపర్. థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీట్స్, గర్జించే డ్రమ్స్, పవర్ఫుల్ రిథమ్స్ ఆ తాండవానికి మరింత శక్తినిచ్చాయి.
ఈ సాంగ్ కి శంకర్ మహదేవన్ – కైలాష్ ఖేర్ వాయిస్ ఇచ్చారు కానీ ప్రమోలో మాత్రం వారి వాయిస్ ను రివీల్ చేయలేదు. లిరిక్స్ ని కల్యాణ్ చక్రవర్తి రాశారు. ఈ సాంగ్ ప్రమోతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. “ది తాండవం” పూర్తి సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది.
అఖండ 2 మ్యూజిక్ జర్నీకి ఇది పవర్ఫుల్ స్టార్ట్ అని చెప్పొచ్చు!