Native Async

గాయం నుండి గ్లామర్ వరకు… శర్వానంద్ అద్భుత ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ!

Sharwanand’s Inspiring Transformation Journey from Injury to Fitness for Biker
Spread the love

2019లో జాను సినిమా షూటింగ్ సమయంలో — స్కైడైవింగ్ సీన్ చేస్తూ శర్వానంద్ కి భుజం గాయమైంది అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది, దాదాపు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో శర్వా బరువు 92 కిలోలకు చేరుకుంది.

దాని గురించి హైదరాబాద్ టైమ్స్ తో మాట్లాడిన శర్వానంద్, ఆ సంఘటన తనను ఎంతగా మార్చిందో చెప్పారు. “ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను నెలల కొద్దీ యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చింది, భోజనం ఎక్కువయ్యేది, బరువు పెరిగిపోతున్నా గమనించలేకపోయాను” అని అన్నారు.

కానీ రెండేళ్ల క్రితం శర్వా కి బైకర్ సినిమా ఆఫర్ వచ్చింది — అందులో ఆయన 18 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించాలి. అందుకే పూర్తిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసాడు శర్వా…

సో, ప్రతి రోజు ఉదయం 4.30కి లేచి, కేబీఆర్ పార్క్‌లో రౌండ్లు వేసి, తరువాత జిమ్ చేసి, సాయంత్రం వాకింగ్ చేసేవాడు. “దాదాపు ఎనిమిది నెలల పాటు ఒక్క రోజూ బ్రేక్ తీసుకోలేదు. ఆ రూటీన్ నాకు ఓపిక, ఫోకస్ నేర్పింది” అని చెప్పారు.

ఇక ఆ తరవాత తండ్రి కావడం శర్వా లో మరో మార్పు తెచ్చింది. కుమార్తె పుట్టిన తర్వాత ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. “ఇంతకుముందు ఫిట్‌నెస్ అంటే సినిమా కోసమే. కానీ ఇప్పుడు అది నా కుటుంబం కోసమే,” అని చెప్పారు.

డైట్ కూడా పెద్ద సవాలు అయ్యిందని ఆయన తెలిపారు. తాను ఫుడ్ లవర్ అయినా, తినడంలో బ్యాలెన్స్ నేర్చుకున్నానని చెప్పారు. “నేను ఆకలితో ఉండలేదు. కానీ తినడానికి ముందు దాన్ని సంపాదించేవాడిని. ఫిట్‌నెస్ అంటే 70 శాతం ఫుడ్, 30 శాతం ట్రైనింగ్,” అని శర్వానంద్ తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఆయన దాదాపు 22 కిలోల బరువు తగ్గారు — అంటే నెలకు ఒక కిలోలా.

బైకర్ గురించి మాట్లాడుతూ — “నిజంగా యువకుడిలా కనిపించాలంటే ఆ లుక్ సంపాదించుకోవాలి, నకిలీ చేయడం కాదు,” అని అన్నారు. ఈ సినిమా తండ్రి-కొడుకు సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆయనకు బైక్స్‌పై ఉన్న ప్యాషన్‌ను తిరిగి గుర్తు చేసింది.

ఇక ప్రస్తుతం శర్వా ‘నారి నారి నడుమ మురారి’ ఇంకా భోగి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. బైకర్ డిసెంబర్ 6న విడుదల కానుంది, నారి నారి నడుమ మురారి మాత్రం సంక్రాంతి 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit