మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో ఇప్పటికే సిక్సర్ కొట్టేశారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” సాంగ్ కూడా అద్భుతంగా హిట్ అయ్యి హాఫ్ సెంచరీ మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్నారు.
ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతంతో వచ్చిన ఈ సాంగ్ నిన్న విడుదలైన వెంటనే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే చికిరి చికిరి యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లోకి వెళ్లి, 46 మిలియన్ వ్యూస్ దాటేసింది. దాదాపు 9.8 లక్షల లైక్స్ సాధించి, ఇది ఇండియాలో 24 గంటల్లో అత్యధికంగా చూసిన సాంగ్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు దక్షిణ భారత రికార్డు (32 మిలియన్ వ్యూస్) కేవలం 13 గంటల్లోనే బద్దలైంది.
పాట సూపర్ క్యాచీగా ఉండగా, రామ్ చరణ్ తన ప్రత్యేకమైన చార్మ్, ఎనర్జీతో అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో స్క్రీన్ ని హీట్ చేశారు. గ్లింప్స్‌లో కనిపించిన ఆయన సిగ్నేచర్ ఫ్రంట్ ఫుట్ షాట్ ఈ పాటలో మళ్లీ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. సాంగ్ మొత్తం — ఎనర్జిటిక్ మ్యూజిక్, ఆకట్టుకునే లిరిక్స్, సౌల్‌ఫుల్ వోకల్స్, అద్భుత విజువల్స్‌తో ఒక మంత్రముగ్ధ అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా, ఈ పాటను ఎలాంటి అధునాతన టెక్నాలజీ ఉపయోగించకుండా, ఒరిజినల్ లొకేషన్లలో షూట్ చేశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రామ్ చరణ్ డ్యాన్స్ కు జాతీయ మీడియా నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన రగ్గ్డ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు జాన్వీ కపూర్ గ్లామర్ ప్రెజెన్స్ ఈ సాంగ్ కి అదనపు ఆకర్షణగా నిలిచింది.
ప్రస్తుతం చికిరి చికిరి సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అవుతూ, అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. మొత్తం మీద రామ్ చరణ్ – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ సాంగ్ మ్యూజిక్ చార్ట్‌లను షేక్ చేస్తోంది!