రోజురోజుకి రాజమౌళి SSMB 29 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మల్టీ స్టారర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివీల్ ఈవెంట్ ని నవంబర్ 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు అని తెలుసు కదా. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గ్రాండ్ ఈవెంట్ గా నిలుస్తుందని సమాచారం.
ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్ననే పృథ్విరాజ్ లుక్ ను ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్‌గా రిలీజ్ చేశారు. ఆ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్‌కి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుమారు పది నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ₹900 నుండి ₹1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చాలా కాలం పాటు నిర్మాతగా కె.ఎల్. నారాయణ ఒక్కరే ఉన్నారని అనుకున్నారు. కానీ తాజాగా రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ ప్రాజెక్ట్ లో కో-ప్రొడ్యూసర్‌గా అధికారికంగా చేరినట్టు ప్రకటించారు.

కార్తికేయ ఇప్పటికే ‘బాహుబలి’ సిరీస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా, ‘RRR’ ఆస్కార్ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. తన ‘షోయింగ్ బిజినెస్’ బ్యానర్ కింద ఆయన ‘మేడ్ ఇన్ ఇండియా’ (దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్), అలాగే ఫహాద్ ఫాజిల్‌తో రెండు సినిమాలు (‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’) నిర్మిస్తున్నారు.
ఇప్పుడు ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ (కె.ఎల్. నారాయణ) ఇంకా ‘షోయింగ్ బిజినెస్’ (ఎస్.ఎస్. కార్తికేయ) బ్యానర్ల కింద ఈ గ్లోబ్‌ట్రాటర్ ను నిర్మిస్తున్నారు. ఒకరు అనుభవం కలిగిన సీనియర్ నిర్మాతగా, మరొకరు యువ ప్రొడ్యూసర్‌గా కొత్త తరహా ఆలోచనలతో ఈ ప్రాజెక్ట్ కి వన్నె తెస్తున్నారు.
ఇక ఈవెంట్ విషయానికి వస్తే – సోషల్ మీడియా లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈవెంట్ కోసం నిర్మిస్తున్న ప్లాట్‌ఫామ్ 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈవెంట్‌కీ లేని భారీ స్టేజ్ సెటప్ అవుతుంది.
రాజమౌళి మాటల్లో చెప్పాలంటే – “ఫ్యాన్స్‌కి ఒక పెద్ద విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాం.” ఇప్పటికే పృథ్విరాజ్ బర్త్‌డే పోస్టర్ తో హైప్ పెంచిన మేకర్స్, ఇప్పుడు నవంబర్ 15 ఈవెంట్‌తో మళ్లీ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.