కొన్ని వారాల క్రితం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నిశ్చితార్థం వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి సింపుల్‌గా ఈ వేడుక జరిగినట్లు సమాచారం. అయితే ఈ వార్త ని ఇప్పటి వరకు ఈ ఇద్దరిలో ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అభిమానులు మాత్రం ఆ అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయ్ ఇప్పటి వరకు ఈ విషయంపై కాం గా ఉన్నప్పటికీ, రష్మిక మాత్రం జగపతి బాబు నిర్వహించిన టాక్ షోలో ఈ విషయం మీద పరోక్షంగా స్పందించింది. ఆమె ఉంగరాన్ని చూపిస్తూ “ఇది నాకు చాలా ప్రత్యేకమైనది” అని చెప్పింది. తాజాగా మరొక టాక్ షోలో “నేను విజయ్‌ను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పడంతో సోషల్ మీడియాలో బజ్ ఊపందుకుంది.

ఆ కార్యక్రమంలో ఒక ఫ్యాన్ ఆమెను – “ఏ హీరోతో రిలేషన్‌లో ఉండాలని అనుకుంటారు?” అని అడిగితె, దానికి రష్మిక సరదాగా “నేను నారుటో అనే యానిమేటెడ్ క్యారెక్టర్‌ను డేట్ చేస్తాను” అని చెప్పింది. వెంటనే నవ్వుతూ “కానీ నేను విజయ్‌ను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పడంతో అక్కడున్నవాళ్లందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయ్ – రష్మిక పెళ్లి ఎక్కువ సమయం పట్టదని, ఫిబ్రవరిలోనే పెళ్లి జరగొచ్చని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని టాలీవుడ్ వర్గాల సమాచారం.