Native Async

ఘట్టమనేని వారసుడి టాలీవుడ్ ఎంట్రీ…

Jaya Krishna Ghattamaneni’s Film Debut Announced | Ajay Bhupathi to Direct Vyjayanthi Movies Project
Spread the love

ఏంటో ఈ మధ్య కాలం లో చాల వారసుల ఎంట్రీ చూస్తున్నాం… ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం ఎంటర్ అవ్వబోతోంది. మొన్నే కదా మనం మహేష్ అక్క మంజుల కూతురు జాన్వీ జెవెలెరీ యాడ్ చూసాం. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు… దివంగత రమేష్ బాబు కుమారుడు… జయకృష్ణ ఘట్టమనేని ఫస్ట్ సినిమా ఈరోజే అనౌన్స్ చేసారు.

ఈ యువ హీరో చాలా కాలంగా నటన, యాక్షన్, డాన్స్ లలో కఠినమైన శిక్షణ పొందుతూ, తన డెబ్యూట్‌కి సీరియస్‌గా సిద్ధమవుతున్నాడు. హీరోగా నిలబడటానికి అవసరమైన ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ తనలోని ప్రతిభను పదునుపెడుతున్నాడు.

ముందుగానే ప్రకటించినట్లుగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు తమ వైజయంతి మూవీస్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ఘట్టమనేని కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం చాలా పాతది. సూపర్ స్టార్ కృష్ణతో చేసిన అగ్నిపర్వతం సినిమా సూపర్ హిట్ అయింది. తరువాత మహేష్ బాబును హీరోగా పరిచయం చేసిన రాజా కుమారుడు కూడా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మూడవ తరం హీరోగా జయకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

డైరెక్టర్ అజయ్ సోషల్ మీడియా లో అనౌన్స్మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేస్తూ, తిరుమల కొండల మధ్యలో నిలిచిన ఆలయం కార్టూన్ రూపంలో చూపిస్తూ, సినిమా నేపథ్యాన్ని అద్భుతంగా ప్రతిబింబించారు. అలానే, “With a Great Story comes Greater Responsibility… Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film. From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️‍🔥”, అని పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు…

ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని మేకర్స్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit