ఒకప్పుడు దక్షిణాది సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపని బాలీవుడ్ తారలు… ఇప్పుడు మాత్రం సౌత్ వైపు ప్రత్యేకంగా చూస్తున్నారు. టాలీవుడ్ అందుకుంటున్న గ్లోబల్ గుర్తింపు, మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు—ఈ రెండు కారణాల వల్లే ఉత్తర భారత నటీనటులు ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు ఈ మార్గాన్ని ఎంచుకొని మంచి ఫలితాలు అందుకున్నారు.

అలాంటి ప్రయత్నం చేసిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా ఒకరు. ఆమె తన తెలుగు ఎంట్రీని ‘జటాధర’ సినిమాతో ప్రారంభించింది. ఈ చిత్రంలో తెలుగు హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, సోనాక్షి ‘ధనపిశాచిని’ అనే చీకటి మైథలాజికల్ క్యారెక్టర్‌గా కనిపించింది. ఆమె పాత్ర దేవతలా ఉన్నా, దానిలో ఉన్న లోభ స్వరూపం కథలో ప్రధానంగా నిలిచింది.
టీజర్లు, ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల్లో పెద్ద ఆశలు రేపిన ఈ చిత్రం గత వారం శుక్రవారం విడుదలైంది. సినిమా ప్లాప్ అయినా కానీ సోనాక్షి పాత్ర కి మంచి గుర్తింపు వచ్చింది.
ఒకప్పుడు “దబంగ్ బ్యూటీ” గా మెరిసిన సోనాక్షి తెలుగు తెరపై తన డ్రీమ్ డెబ్యూట్‌గా భావించిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త విలన్ దొరికినట్టే అంటున్నారు ప్రేక్షకులు.