తాజాగా విడుదలైన ‘ప్రీ వెడ్డింగ్ షో’ తో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు తిరు వీర్ తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసాడు.
ఇప్పటివరకు పేరు ఖరారు కాని ఈ కొత్త ఎంటర్‌టైనర్‌లో ఆయనకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించనున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాతో దర్శకుడిగా భారత్ దర్శన్ పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మహేశ్వర రెడ్డి మూలి గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ రోజు హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో సినిమా టీమ్, బంధువులు, మిత్రులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా వినోదభరితంగా, ప్రేక్షకులకు హాయిగా నవ్వులు పంచేలా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
సినిమాటోగ్రఫీ బాధ్యతలను సీహెచ్ కుశేందర్ నిర్వహించగా, సంగీతాన్ని భరత్ మాంచిరాజు అందిస్తున్నారు.
అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న ఈ సినిమా అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది. తిరు వీర్ – ఐశ్వర్య రాజేష్ జోడీగా తెరపై చూడటం ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్‌నెస్‌ని అందించేలా ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.