Native Async

సందీప్ కిషన్ కొత్త మూవీ ‘సిగ్మా’…

Sundeep Kishan’s Sigma — A High-Octane Heist Action Comedy Directed by Jason Sanjay
Spread the love

తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో సందీప్ కిషన్, లేటెస్ట్ గా హై వోల్టేజ్ హైస్ట్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ ‘సిగ్మా’ ని జస్ట్ ఇప్పుడే సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు… ఈ చిత్రానికి సూపర్‌స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు… తనకిదే ఫస్ట్ సినిమా. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన సిగ్మా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సందీప్ కిషన్ గోల్డ్ బార్స్, కరెన్సీ నోట్స్ మధ్య కూర్చున్న తీరు చూస్తేనే సినిమాకి ఉన్న థ్రిల్లింగ్ నేపథ్యం అర్థమవుతుంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 95% పూర్తయిందని మేకర్స్ తెలిపారు. చివరి పాట చిత్రీకరణతో మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుంది.

ఈ చిత్రంలో సందీప్ తన యాక్షన్ స్కిల్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌ ని కూడా చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ ‘సిగ్మా’ సినిమా త్వరలోనే సమ్మర్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit