కొద్ది వారాలుగా ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ గురించి, ముఖ్యంగా దాని ఫస్ట్ సింగిల్ విడుదలపై సోషల్ మీడియాలో అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది. ఈ పాట ఎప్పుడు వస్తుందో అని రోజు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ, మేకర్స్‌కి రిక్వెస్టులు చేస్తున్నారు. చివరికి నిర్మాత ఇంకా టీమ్ మెంబర్ SKN ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అయన మాట్లాడుతూ, నార్త్ ఇండియా మార్కెటింగ్ టీమ్, తెలుగు మార్కెటింగ్ టీమ్ మధ్య ఏ పాటను ముందుగా రిలీజ్ చేయాలన్న చర్చల వల్లనే ఆలస్యం జరుగుతోందని. “ఒక వారంలో ఈ సమస్య పరిష్కారమవుతుంది” అని ఆయన అభిమానులకు భరోసా ఇచ్చారు.
ప్రభాస్ అభిమానులతో ‘ఎక్స్’ లో మాట్లాడిన ఎస్.కె.ఎన్ – “మా సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. నార్త్ ఇండియా ప్రమోషన్ ఒక రకంగా జరుగుతుంది, మన తెలుగు ప్రొమోషన్ మరో విధంగా ఉంటుంది. మేము మొదట ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్లు ముందుగా మెలోడీ సాంగ్ రిలీజ్ చేయాలని సూచించారు. అందుకే ఈ చర్చ కొంత ఆలస్యం అయ్యింది” అని వివరించారు.
అలాగే, “మన దక్షిణ భారతంలో లిరికల్ వీడియోలు కొద్దిగా మాత్రమే రిలీజ్ చేస్తాం, కానీ నార్త్‌లో మాత్రం పూర్తి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తారు. ఈ వ్యత్యాసం వల్లే పాట విడుదల కొంచెం వాయిదా పడింది” అన్నారు.
అతను ఇంకా మాట్లాడుతూ — “సినిమాలో ఎటువంటి ఐటమ్ సాంగ్ ఉండదు. అయితే, ఒక పాపులర్ విన్టేజ్ హిందీ పాటకు రీమిక్స్ వెర్షన్ ఉంటుంది, అది ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్‌గా ఉంటుంది” అని తెలిపారు. “ఒకసారి ఈ చర్చలు ముగిశాక, ప్రతి పాట 10 నుండి 14 రోజుల గ్యాప్‌లో విడుదల అవుతుంది. మొదటి సింగిల్ నవంబర్ మూడో లేదా నాలుగో వారం విడుదలయ్యే అవకాశం ఉంది” అని చెప్పారు.
డిసెంబర్ చివరి నుంచి సినిమా ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభమవుతాయని, సినిమా 2026 జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల కానుందని తెలిపారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. థమన్ పని చేస్తున్నారు.