మహేష్ బాబు, SS రాజమౌళి ల సినిమా అంటేనే ఫస్ట్ నుంచే బాగా హైప్ ఉంది… ఇక ఆ సినిమా లో ప్రియాంక చోప్రా, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు అని తెలిసిన తరవాత, హైప్ కొంచం పెరిగింది.
ఇక్కడి వరకు ఓకే… షూటింగ్, క్యాస్ట్ updates , ఇవన్నీ హైప్ ఇస్తాయి కానీ… సినిమా టైటిల్ కె రామోజీ ఫిలిం సిటీ లో ఒక స్పెషల్ ఈవెంట్ అనగానే అబ్బో అనుకున్నాం. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ కన్నా ముందే సినిమా లో మెయిన్ విలన్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రెవీల్ చేయగానే, స్పెషల్ మూవీ కి ఇలానే surprises ఉంటాయి అని అనుకున్నాం. అలానే ప్రిథ్వి కుంభ గా అదిరిపోయేలా ఉన్నాడు పోస్టర్ లో!

ఇక నెక్స్ట్ టైటిల్ ఈ వస్తుంది అనుకున్నాం… కానీ నిన్న రాత్రి మళ్ళి అదిరిపోయే లా చేసాడు జక్కన్న… అందుకే ఇప్పుడు గ్లోబ్‌ట్రాట్టర్… ఈ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలోనే కాకుండా ప్రేక్షకుల మనసుల్లోనూ ఒక మ్యాజిక్‌గా మారింది.
ఈ వీకెండ్‌లో సినిమా గ్లింప్స్ విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా, మేకర్స్ సడన్‌గా “సంచారి” పాటను రిలీజ్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
ఈ “సంచారి” పాటను తెలుగు, తమిళ భాషల్లో శ్రుతి హాసన్ తన అద్భుతమైన వాయిస్‌తో ఆలపించింది. ఎం.ఎం.కీరవాణి ఈ మ్యూజికల్ మాస్టర్‌పీస్‌కి స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో మహేష్‌బాబు పాత్రలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రపంచాన్ని చుట్టే ఆ ఎడ్వెంచరస్ ఫీల్ స్పష్టంగా కనిపిస్తుంది. రాక్ మ్యూజిక్‌తో కలిపిన కీరవాణి బీట్‌లు ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాయి.
అసలు శృతి అదరగొట్టేసింది… ఆమ్మో సూపర్ గా పడింది అని అందరు అనుకుంటున్నారు…
ఇంకా పెద్ద విషయం ఏంటంటే – ఈ పాట విడుదలను ఎవ్వరూ ఊహించలేదు. ఎటువంటి ప్రీ-అనౌన్స్‌మెంట్లు లేకుండా, అకస్మాత్తుగా “సంచారి”ను రిలీజ్ చేయడం ద్వారా రాజమౌళి తన సినిమాల ప్రమోషన్‌లో ఎంత తెలివిగా ఆలోచిస్తారో మరోసారి నిరూపించారు. అభిమానులకీ ఇది పూర్తిగా హార్ట్ టచ్ అయిన సర్‌ప్రైజ్.

అలానే పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రుతి హాసన్ –
“ఎం.ఎం.కీరవాణి సార్ మ్యూజిక్‌లో పాడడం చాలా ఆనందంగా ఉంది. ‘గ్లోబ్‌ట్రాట్టర్’ కోసం పాడిన ఈ పాట ఒక పవర్‌ఫుల్ ట్రాక్. రికార్డింగ్ సమయంలో సార్ పియానోపై ఏదో మంత్రం లా ప్రారంభించారు. నేను ‘విఘ్నేశ్వర మంత్రం’ అనుకుని వినిపిస్తున్నాను అనుకున్నాను. కానీ అది నాన్న పాట అని తెలిసిన క్షణం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆ రోజు సార్ చూపిన ప్రేమ, ఆత్మీయత మరచిపోలేనిది.”
ఇప్పటికీ ఈ “సంచారి” పాట సినిమా సౌండ్‌ట్రాక్‌లో భాగమా లేదా ప్రమోషనల్ సాంగ్‌గా మాత్రమే వాడతారా అన్నది క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం — ఈ పాటతో గ్లోబ్‌ట్రాట్టర్ పై ఉన్న అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి.
SS Rajamouli
అలాగే ఈ పాట ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ప్రిథ్వీరాజ్, రాజమౌళి, ఇలా అందరు తమ ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకుంటూ, ప్రేక్షకులను థ్రిల్ చేసారు…
Mahesh Babu
Priyanka Chopra
Prithviraj Sukumaran