అల్లరి నరేష్ అంటేనే ఎప్పుడు ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకువస్తాడు అని అతని ఫాన్స్ నమ్మకం. అలానే నాంది, మారేడుమిల్లి ప్రజానీకం ఇలా మంచి సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు ’12 A రైల్వే కాలనీ’ అని ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. రిలీజ్ డేట్ దెగ్గరపడడం తో ఈరోజు ట్రైలర్ కూడా లాంచ్ చేసాడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సాయి కుమార్ ఒక కేసు గురించి మాట్లాడుతూ, ఆ మర్డర్ కేసు తాను సాల్వ్ చేయలేదని, అల్లరి నరేష్ ఇంట్రో చూపిస్తారు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అల్లరి నరేష్ తెలివి తో ప్రతి పాయింట్ ఎలా పట్టుకుంటాడో చూపిస్తారు. అలానే మరి నరేష్ పోలీస్ కాలేదు కదా, ఆ కేసెస్ ఎలా సాల్వ్ చేసాడు అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఒకే పాత్ర కి రెండు కోణాలు అన్నట్టు ఉంది ఈ ట్రైలర్… ఆ ఐస్ లో డైవింగ్ కూడా బాగా చూపించారు… ఇక ఈ సినిమా ఇంకో పది రోజులు అంటే 21st నవంబర్ న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!