Native Async

రాహుకేతు దోషాలకు కాలభైరవ అష్టమి చక్కని పరిష్కారం

Kaal Bhairava Ashtami 2025 – Powerful Remedy for Rahu and Ketu Doshas
Spread the love

ఈరోజు కాలభైరవ అష్టమి.శివుని క్రూరమైన విధ్వంసకర రూపం అయిన కాలభైరవుడు కార్తిక బహుళ అష్టమి రోజున అవతరించాడు అని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురూ తమలో తాము ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో బ్రహ్మ, శివుడిని తూలనాడుతూ మాట్లాడాడుట. ఆగ్రహించిన శివుని నుదుటి భాగం నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఖండించి, చతుర్ముఖుడ్ని చేశాడుట. పొడువాటి శూలం చేతిలో ధరించి,కుక్క మీద కూర్చొని ఉండే రూపంగా కాలభైరవుడి రూపవర్ణన. భక్తులు ఈరోజు కాల భైరవుడ్ని పూజించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుందనీ, అన్నీ పనులయందు విజయం లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు కాల భైరవుడ్ని పూజించి,శివునికి రుద్రాభిషేకం చేయడం వలన,తమ జాతక చక్రంలోని రాహు గ్రహ, శని గ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం.

కార్తీక బుధవారం రాశిఫలాలు – ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit