చలి మొదలైంది. చలికాలంలో రకరాలైన రుగ్మతలతో పాటు శరీరంలోని చర్మం, కేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చర్మం, కేశాలను సంరక్షించుకోవడం ఈ చలికాలంలో సవాల్‌తో కూడుకొని ఉంటుంది. అంతేకాదు, చలికాలంలో శరీరం పొడిబారిపోతూ ఉంటుంది. పెదవులు ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో తలలో దురద, డ్యాండ్రఫ్ వంటివి అధికంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని రక్షించుకునేందుకు రకరాకలైన నూనెలు, యాంటీ డ్యాండ్రఫ్ షాంపులు ఉపయోగిస్తుంటారు.
బీహార్ ఫలితాలు దేశానికి ఏం చెబుతున్నాయి?
ఇలా చేయడం వలన తలలోని మాడు మరింత దెబ్బతింటుంది. తలలో డ్యాండ్రఫ్ వంటిది రావడానికి ప్రధాన కారణం చర్మం పొడిబారడం. సల్ఫేట్లు లేని షాంపులు వాడటం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయకుండా ఉండటం, ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి హ్యూమిడిఫయర్లు వాడటం, అవిసెలు, గడ్లు, నట్స్, బాదం వంటివి తీసుకుంటే చాలని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.