మదర్‌ ఆఫ్‌ ట్రీస్‌ తిమ్మక్కకు పవన్‌ కళ్యాణ్‌ ఘననివాళి

Saalumarada Thimmakka Tribute to India’s “Mother of Trees”
Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన వారే చెట్లను క్రూరంగా నరికి, అడవులను నాశనం చేసి, స్వార్థ ప్రయోజనాల కోసం విలువైన సహజ వనరులను అక్రమంగా దోచుకునేందుకు మార్గం సుగమం చేసిన దృశ్యాలు మనం చూశాం. కానీ మరో వైపున, తన మొత్తం జీవితాన్నే ప్రకృతికి అంకితం చేసిన ఒక నమ్రతమయిన మహానుభావురాలు ఉన్నారు — “చెట్ల తల్లి”గా ప్రసిద్ధి పొందిన సాలుమరದ తిమ్మక్క.

కర్ణాటకలోని చిన్న గ్రామంలో పుట్టిన తిమ్మక్క దంపతులు, వారికి సంతానం కలగకపోయినా నిరాశ చెందలేదు. దాని బదులుగా పచ్చదనాన్ని తమ సంతానంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమతో, నిత్య శ్రమతో ప్రపంచానికి అద్భుతమైన హరిత కవచాన్ని అందించారు. 8,000 కంటే ఎక్కువ చెట్లను, అందులో 375 భారీ వట వృక్షాలను నాటి, ప్రేమతో పెంచిన వారు. ఆమె జీవితం అధికారం కోసం కాదు, ధనం కోసం కాదు… భూమాత పట్ల నిస్వార్థ ప్రేమతో చేసిన వ్రతం.

ఈరోజు, 114 ఏళ్లు పూర్తి చేసిన ఈ ప్రసిద్ధ ప్రకృతి మాత మనల్ని శాశ్వతంగా విడిచిపోయారు. నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటో ఆమె జీవితం ఒక గొప్ప పాఠం. జనసేన తరఫున, ఈ మహోన్నతురాలైన సాలుమరద తిమ్మక్క గారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

మనం చెట్ల తల్లిని కోల్పోయినా, ఆమె ఆత్మ, ఆమె స్పూర్తి మనతోనే నిలిచి ఉంటుంది. మనం పర్యావరణ రక్షణ కోసం కృషి చేయాలని, మన పరిసరాల్లో ఎక్కువగా చెట్లు నాటాలని, ఈ భూమికి అత్యవసరంగా కావలసిన బాధ్యతగల పౌరులమవాలని ఆమె మనందరికీ శాశ్వత స్ఫూర్తి అందిస్తుందని పవన్‌ కళ్యాణ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit