జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం రెండు కూడా జాతకుని లక్షణాలను, భవిష్యత్‌లో జరగబోయే విషయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తుంటాయి. జాతకుడు పుట్టిన తేదీని అనుసరించి అతని జాతకం ఉంటుంది. అయితే, సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 సంఖ్య దూకుడుకు సంబంధించినది. 9, 18, 27 ఈ మూడు తేదీల మూల సంఖ్య 9. ఈ తేదీలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 9 సంఖ్యలో జన్మించిన వ్యక్తులు ఉత్సాహంగా దైర్యంగా ఉంటారు. లీడర్షిప్ గుణం, ఇతరులను ప్రభావితం చేయగల శక్తి వీరి సొంతం. పోరాటం చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు.
తక్కువ మాటలతో ఎక్కువ పనులు చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కోపం ఎక్కువైనా మానసికంగా గొప్పవారిగా ఉంటారు. 9 సంఖ్యలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా పోలీస్, ఆర్మీ, ఫైర్ డిపార్ట్‌మెంట్, స్టోర్స్ రంగాల్లో సేవలు అందిస్తుంటారు. రాజకీయాల్లో రాణిస్తారు. వ్యాపారంలో రాణించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో నిజాయితీ, అంకితభావం కనిపిస్తుంది. ధైర్యం ఉన్నప్పటికీ అంతరంగం మృధువుగా ఉంటుంది. ఈ 9 సంఖ్యలో పుట్టిన వారికి కలిసివచ్చే దిశ దక్షిణం, రంగులు ఎరుపు గులాబి, పసుపు. మంగళవారం, ఆదివారాలు ఈ జాతకులకు కలిసి వస్తాయి.