రామ్ పోతినేని… అతని ఎనర్జీ, గ్రేస్ ఇంకా స్క్రీన్ ప్రెజన్స్ గురించి మేము చెప్పకర్లేదు. కానీ కొన్ని రోజుల నుంచి సరైన హిట్ పడలేదు. సో, ఇప్పుడు తన స్ట్రెంత్ ఐన యాక్షన్ ఫామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నాడు.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఇంకో పది రోజులు అంటే 27th నవంబర్ న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది… సో, నిన్ననే గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేసి, ఎక్కడ చూడని విదంగా డ్రైన్ షో చూపించి అదరగొట్టారు.
ఇక ట్రైలర్ లో రామ్ సాగర్ గా నటించి, ఒక పెద్ద నటుడు ఉపేంద్ర కి బీభత్సమైన ఫ్యాన్ గా కనిపించాడు. అతని ఫేవరెట్ హీరో కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి గా కనిపించి మెప్పించాడు. కానీ అతను ఎంత ఫ్యాన్ అయినా తనకి ఒక జీవితం ఉంటుంది కదా… అలానే భాగ్యశ్రీ తో లవ్, తన స్థాయి కన్నా పెద్ద లెవెల్ లో ఉన్న హీరోయిన్ తో సరిపడాలంటే ఎదో సాదించాలి. ఆలా మరి సాగర్ కష్టాల్లో ఉంటె ఉపేంద్ర ఎలా సహాయం చేసాడో పెద్ద తెర మీదే చూడాలి…