తమిళ్ యాక్టరు కార్తీ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడతాయి… ఐతే ఇప్పుడు అతని కొత్త సినిమా ‘Vaa Vaathiyaar మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తి హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్‌గా కనిపించబోతున్నారు. సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, శిల్పా, కరుణాకరణ్, జీఎం సుందర్, వడివుకరసి, మధుర్ మిట్టల్ వంటి బలమైన నటీనటులు ఈ కథలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు టెక్నికల్ గా కూడా మంచి టీమ్ ఉన్నది. ప్రతి సినిమా లోనూ వేరే వేరే పాత్రలతో ఆకట్టుకునే కార్తి, ఈసారి కూడా మరో ఎంగేజింగ్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 2025లో గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది ఈ సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో కార్తికి ఉన్న క్రేజ్ వల్ల, ఈ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక స్పెషల్ అప్‌డేట్ వచ్చేసింది.
తెలుగు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా, ఈ సినిమాను తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో టైటిల్ ను “అన్నగారు వస్తారు” గా ఫిక్స్ చేశారు. కార్తి స్టైలిష్‌గా కనిపించే ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి ఈ అప్‌డేట్‌ను సాలిడ్‌గా అన్‌వీల్ చేశారు.
ఈ సంవత్సరం చివరి భారతీయ చిత్రం క్యాలెండర్లో, తెలుగు ప్రేక్షకులు మరో కార్తి స్టైల్ ఎంటర్టైనర్ కోసం రెడీ కావచ్చు…