పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నప్పటికీ… కొంతమంది మహిళలు హింసకు గురౌతున్నారు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండాలిగాని, ఒకరినొకరు దూషించుకుంటూ, కొట్టుకుంటూ ఉండకూడదు. మహిళలపై చేయిచేసుకోవడం చట్టబద్ధంగానే కాదు… పురాణాల పరంగా కూడా నేరమే. ఈ నేరాలకు భూలోకంలో శిక్షలు ఒకవిధంగా ఉంటే, మరణించిన తరువాత గరుడపురాణం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయని అంటున్నారు. గరుడపురాణంలోని ఏడవ అధ్యాయం ప్రకారం భార్యను శారీరకంగా లేదా మానసికంగా హింసిస్తే రౌరవ నరకానికి పంపుతారట.
భక్తులే కాదు…సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి కూడా తలనీలాలు సమర్పిస్తాడట
రురు అనే భయంకరమైన పాము భార్యను హింసించిన భర్తలను నిరంతరం కాటేస్తుంది. మరుజన్మలోనూ తీవ్రమైన బాధలు అనుభవించవలసి వస్తుంది. భార్యతో కాకుండా మరో స్త్రీతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి మరణించిన తరువాత కుంభీపాక నరకంలోకి నెట్టివేయబడతాడు. అక్కడ యమధూతలు ఆత్మను మరిగే నూనెలో వేసి హింసిస్తారు. అంతేకాదు, భార్యను హింసించే వ్యక్తి మరణించిన తరువాతే కాదు, బతికుండగానే జీవితం నరకంలా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్య హక్కులను హరించి హింసించే వ్యక్తులు అనేక జన్మలపాటు పేదరికాన్ని, నరకాన్ని అనుభవించవలసి వస్తుందని గరుడపురాణం చెబుతున్నది.