ప్రపంచంలో అత్యధికమంది బాధపడుతున్న జబ్బుల్లో ఒకటి డయాబెటిస్. ఊబకాయం తరువాత డయాబెటిస్‌తోనే ఎక్కువమంది ఇబ్బందులు పడుతున్నారు. దారితప్పిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం తదితర అంశాలు డయాబెటిస్‌కు కారణమౌతున్నాయి. డయాబెటిస్‌నుంచి బయటపడేందుకు రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్. ఒక్కసారి ఇది ఒంట్లోకి ప్రవేశించింది అంటే జీవితకాలంపాటు తిష్టవేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పరగడుపున 125 దాటినా…భోజనం తిన్న 2 గంటల తరువాత 200 దాటినా మధుమేహం వచ్చిందని అర్ధం చేసుకోవాలి. ఒక్కసారి మధుమేహం శరీరంలోకి ప్రవేశిస్తే మందులు వేసుకోవడం మొదలుపెట్టాల్సిందే. ఆహారం, వ్యాయామం చేసినా కూడా తప్పనిసరిగా మందులు వాడాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆహారం వ్యాయామం విషయంలో కఠిమైన నియంత్రణ అవసరం. దీంతో పాటుగా తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవడానికి కాకరకాయ రసం తీసుకుంటూనే నేరేడు పండ్లను కూడా తీసుకోవాలి. ఆయుర్వేద చిట్కాలను పాటిస్తూ ఉంటేనే కొంతవరకు కంట్రోల్‌లో ఉంటుంది. మధుమేహం లేకుండా ఉండేవారికి ఖర్జూరంపండ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ, డయాబెటిస్‌తో ఇబ్బందిపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖర్జూరం పండ్లను స్వీకరించకూడదు. కానీ, ఈ ఖర్జూరం పండ్లలో ఉండే గింజలు మధుమేహానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గింజలను తీసుకుంటే డయాబెటిస్ నయమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం విత్తనాలు రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహకరిస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణసంబంధమైన రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.
ఖర్జూరం గింజలు చాలా గట్టిగా ఉంటాయి కదా. ఎలా వీటిని తీసుకోవాలనే సందేహాలు కలగడం సహజమే. దీనికోసం కొన్ని చిట్కాలున్నాయి. ఖర్జూరం విత్తనాలను బాగా కడిగి కొన్ని రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత ఈ గింజలను స్టౌమీద పాన్ పెట్టి వాటిపై దోరగా వేపాలి. ఇలా వేపిన ఖర్జూరం గింజలను చల్లార్చుకొని, ఆ తరువాత మిక్సీలో వేసి పౌడర్‌లా గ్రౌండ్ చేయాలి. ఇలా తయారైన పౌడర్‌ను గాలి ప్రవేశించకుండా డబ్బాలో నిల్వచేసుకోవాలి. ప్రతిరోజూ అర టీస్పూన్ పౌడర్‌ను గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపున ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా వారం రోజులపాటు చేసి చూడండి తప్పకుండా గుణం కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం కంట్రోల్ అవుతుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.