అంత ‘చికిరి చికిరి’ హవా నే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘RRR’తో ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న తర్వాత, ఇప్పుడు గ్రామీణ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా ‘Peddi’ తో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచేందుకు సిద్ధమవుతున్నారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర సంగీత ప్రయాణం మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ తో ఘనంగా ఆరంభమైంది.

ఏ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట, ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులను అలరిస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే మొత్తం భాషల్లో కలుపుకుని 100 మిలియన్ల వ్యూస్ దాటటం ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది.

ఇంకా:
తెలుగు వెర్షన్ 64 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు లక్షల లైకులతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది.
హిందీ వెర్షన్ 25 మిలియన్ల వ్యూస్, తమిళ్, కన్నడ, మలయాళ భాషల వెర్షన్లు కలిసి మరో 10 మిలియన్ల వ్యూస్ సాధించాయి.

రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో రామ్ చరణ్ ఇచ్చిన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాయి. రీల్స్‌, ఫ్యాన్ ఎడిట్స్ వరకు సోషల్ మీడియాలో ‘చికిరి చికిరి’ సునామీలా ట్రెండ్ అవుతోంది. నిజంగానే, ఇది మాస్ మానియాతో దూసుకుపోతున్న పాట!

ఈ అసాధారణ స్పందనతో ‘Peddi’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మార్చి 27, 2026 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం ఎదురుచూపులు మరింత పెరిగిపోయాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *