టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారుండరు… అలాగే కృష్ణ వారసత్వాన్ని మహేష్ సూపర్ గా కనసాగిస్తుండగా, కూతురు మంజుల కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు మూడో తరం ఎంట్రీ ఇచ్చింది… ఆల్రెడీ మహేష్ బాబు మేనల్లుడు గళ్ళ అశోక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా మంజుల కూతురు జాన్వీ కూడా ఒక ఆభరణాల యాడ్ లో మెరిసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఫస్ట్ సినిమా చేస్తున్నాడు.
తన ఫస్ట్ సినిమా ప్రయాణాన్ని నడిపిస్తున్న దర్శకుడు… RX 100, మంగళవారం లాంటి RAW సినిమాలను రూపొందించిన అజయ్ భూపతి. ఇలాంటి దర్శకుడి చేతిలో ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరో డెబ్యూ అవుతుండటం ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇందాకే చిత్ర బృందం టైటిల్‌తో ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్ ‘శ్రీనివాస మంగాపురం’ సూపర్ గా ఉంది… అలాగే పోస్టర్లో హీరో ఇంకా అతని ప్రేయసి గట్టిగ గన్ను పట్టుకున్నారు. సో, ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ డ్రామా అనమాట…
పోస్టర్ లో వెనుక ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం … నిశ్శబ్దంగా శ్రీవారి కొండలు… కథలో దాగి ఉన్న ఆధ్యాత్మికతను, మిస్టరీని మరింతగా పెంచేస్తున్నాయి.
ఈ భారీ ప్రాజెక్టును ప్రెజెంటర్‌గా అశ్విని దత్, నిర్మాతగా పి. కిరణ్ ఉన్నారు. చందమామ కథలు బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో హీరో జయ కృష్ణకు జతగా బాలీవుడ్ నటి రాషా తాదాని తన తెలుగు అరంగేట్రం చేస్తున్నారు. తను రవీనా టాండన్ కూతురు… సంగీతాన్ని జీ.వి. ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు.
ఇంకా త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ కానుంది అని నిర్మాతలు చెప్పారు…