Native Async

శుక్రమౌఢ్యమి ఎందుకు శుభకరం కాదు

Why Shukra Mouddhyami Is Not Auspicious – Venus Moudyam Effects, Dos and Don’ts Explained
Spread the love

శుక్రమౌడ్యమి కాలం ప్రారంభమైంది. నవంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు మూఢం కొనసాగుతుంది. ఈ మూఢం శుభమా అశుభమా అంటే నూతన కార్యక్రమాలు చేపట్టే వారికి అశుభమేనని అంటున్నారు పండితులు. వివాహాలు, నూతన వ్యాపారాలు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలను ఈ మూఢంలో చేయకూడదు. అయితే, ఈ కాలంలో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు, నిత్యదేవతారాధనలు, అన్నప్రాసన, సీమంతం వంటివి నిర్వహించుకోవచ్చు. ఈ 83 రోజులపాటు శుక్రుడు సూర్యుడికి దగ్గరగా జరుగుతాడు. దీంతో శుక్రుడి శక్తి తగ్గిపోతుంది. శుక్రుడి శక్తి తగ్గిపోతుంది. శుక్రుడి ప్రభావం తగ్గితే నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తే ఇబ్బందులు ఎదురౌతాయి. శుక్రగ్రహ ప్రభావం లేకుంటే లక్ష్మీకటాక్షం తగ్గిపోతుంది. అందుకే ఈ మూఢాన్ని కొన్ని పనులకు శుభంగాను, మరికొన్ని పనులకు అశుభంగాను చెబుతారు.

అయితే, మూఢం పూర్తయ్యే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫిబ్రవరి 7 వ తేదీన మూఢం పూర్తవుతుందని కొంతమంది పండితులు చెబతే, మరికొందరు మాత్రం ఫిబ్రవరి 17 వరకు మూఢం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శుక్రుడితో పాటు గురుడు కూడా ఈ 83 రోజులు తన ప్రభావాన్ని కోల్పోతాడు. దీంతో ప్రతికూల శక్తులు విస్తరించే అవకాశం ఉంటుంది. గురుడు, శుక్రుడు బలహీనంగా ఉన్న సమయంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టినా ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ మూఢంలో కొన్ని తప్పనిసరి పరిస్తితుల్లో చేయవలసిన పనులు చేసుకునేందుకు అడ్డంకులు ఉండవని చెబుతున్నారు. మొత్తానికి శుక్రమౌఢ్యమి రోజుల్లో నూతనంగా ఎటువంటి పనులను కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit