రియల్ జిడిపి సంవత్సరానికి 8.2 శాతం వృద్ధిని సాధించింది. ముందుగా ఊహించిన 7.4 శాతం అంచనాలను దాటుతూ, గత ఏడాది 5.6 శాతం వృద్ధిని మించి ఈ సంవత్సరం మరింత బలమైన ప్రగతిని చూపించింది. తయారీ రంగం 9.1 శాతం వేగంతో పెరిగింది. సేవారంగం 9.2 శాతం వృద్ధి సాధించింది. ప్రైవేట్ వినియోగం 7.9 శాతం పెరిగింది. వ్యవసాయ రంగం మాత్రం స్థిరమైన 3.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
శుక్రమౌఢ్యమి ఎందుకు శుభకరం కాదు
ఈ వృద్ధి దేశీయ డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. అమెరికా సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ తన ధృడతను నిలబెట్టుకుంది. ఈ ప్రగతి భారత దేశాన్ని ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది.
ఫిస్కల్ ఇయర్ 2026 తొలిార్థంలో భారత ఆర్థిక వృద్ధి సగటుగా 8.0 శాతంగా ఉండటం కూడా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని మరింత బలపరుస్తోంది.