Native Async

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు

Suspicious Movement Near Deputy CM Pawan Kalyan During Rajole Tour Reported to District SP
Spread the love

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికు చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికు సమీపంలో సంచరించారు.

ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమయింది. ఈ విషయాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు. తగిన విచారణ చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit