సూపర్ ఎనర్జీ, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు అంటే గుర్తుకొచ్చే పేర్లలో మొదటిది దర్శకుడు అనిల్ రావిపూడిదే. ఇక ఇప్పుడు మళ్లీ మాస్, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిసిన ఒక భారీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అది కూడా మన మెగాస్టార్ తో…— అందుకే మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పైన చాల ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్. ఇంకా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కలిసి కనిపించడం ఈ సినిమా మీద అంచనాలను ఆకాశానికెత్తేసింది.
అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా థియేటర్ ఫెస్టివల్‌గా మార్చేందుకు ఒక్క చిన్న విషయంలో కూడా రాజీపడట్లేదు. ఇద్దరు స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే పెద్ద సంబరం. దానికి తోడు… వీరిద్దరూ కలిసి ఒక భారీ మాస్ బీట్‌కు స్టెప్పులు వేస్తున్నారంటే? ఫ్యాన్స్‌కి ఇది అసలైన పండుగే! ప్రస్తుతం ఈ అద్భుతమైన, స్టైలిష్ డాన్స్ నంబర్ షూటింగ్ గచ్చిబౌలిలో రూపొందించిన రంగురంగుల సెట్లో నడుస్తోంది.
ఈ పాట కోసం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన స్టాండర్డ్ హై-వోల్టేజ్ బీట్‌లతో ఓ అదిరిపోయే ఫుట్-టాపింగ్ ట్రాక్‌ను కంపోజ్ చేశారట. విన్న వెంటనే డాన్స్ చేయాలనిపించే ఎలక్ట్రిక్ ఎనర్జీతో ఈ పాట సెట్లోనే పండగ వాతావరణం క్రియేట్ చేసిందని టాక్. అందుకే సుమారు 500 మంది డ్యాంసర్లతో ఈ సాంగ్‌ను ఒక భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చుతున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ హైప్‌ను ఆకాశానికి చేర్చిన సాంగ్ — మొదటి సింగిల్ “మీసాల పిల్ల…”. ఈ సాంగ్ అప్‌లోడ్ అయ్యి కొద్ది రోజుల్లోనే యూట్యూబ్‌లో 72 మిలియన్ వ్యూస్ దాటేసి, ఈ సంవత్సరం అన్‌డిస్ప్యూటెడ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇంకా ఫ్యాన్స్ ఆ సాంగ్ హై నుంచి బయటపడకముందే… చిరంజీవి–నయనతారల కాంబినేషన్‌లో వచ్చే రెండో సింగిల్ కోసం టీమ్ రెడీ అవుతోంది.
స్టార్ పవర్, భారీ స్కేల్, మ్యాజికల్ మ్యూజిక్ — ఈ మూడు కలిసిపోయినప్పుడు వచ్చే అనుభూతి ప్రత్యేకం. అదే అనుభూతిని మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటి నుంచే ఇస్తోంది. అందుకే ఈ సినిమా 2026 సంక్రాంతికి వచ్చే అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.