సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న పెరుగుతున్న టికెట్ రేట్లు, పైరసీ ఎప్పటి నుంచో debatable టాపిక్స్… ఈ ఇష్యూల మీద ఇప్పుడు CPI నాయకుడు నారాయణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మీడియాతో మాట్లాడిన నారాయణ గారు ఇబొమ్మ రవి గురించి కూడా మాట్లాడారు… “ఒకరిని అరెస్ట్ చేస్తే సమస్య సాల్వ్ అవ్వదు. ఈ సిస్టమ్‌లోని లోపాలే చాలా మందిని అలాంటి దారుల్లో నెడుతున్నాయి” అని కౌంటర్ ఇచ్చారు. రవి టాలెంటెడ్ యంగ్‌స్టర్ అని, సిస్టమ్ ఫెయిల్యూర్స్ వల్లే అతను ఈ రూట్లోకి వెళ్ళాడని అన్నారు.
ముఖ్యంగా… “నేనూ iBomma లో సినిమాలు చూశాను” అని నారాయణ గారు ఓపెన్‌గా చెప్పేసిన మాటే ఇప్పుడు పెద్ద చర్చ. “సినిమా టికెట్లు ఆరు వందలు… ఏడు వందలకి పెంచేస్తే, సాధారణ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వాళ్లు సినిమాలు ఎలా చూస్తారు?” అని ప్రశ్నించారు.
ఇక అసలు బాంబ్ ఏమిటంటే… “సినిమా మాఫియా” అనే పదం.
సినీ ఇండస్ట్రీ కోట్లతో సినిమాలు తీస్తుంది, కానీ ఆ బరువు అంతా ప్రజలమీదే వేస్తున్నారు… సినిమా టికెట్ రేట్లు గగనానికి ఎగరేసి, దానికి కారణం పైరసీ అని చెప్పడం సరికాదని నారాయణ గారు ఫైర్ అయ్యారు.
“ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినా, సిస్టమ్ మారనంత వరకు ఇలాంటి వారు ఇంకోపది మంది వస్తారు. రూట్ సమస్యలు సాల్వ్ చేయకపోతే పైరసీ ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు.
అంటే… ఒక్కరిని టార్గెట్ చేసి సమస్యలు పరిష్కారం కానని, వ్యవస్థనే మార్చాల్సిన అవసరం ఉందని నారాయణ గారి స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది!