తెలుగు సినిమా… తెలుగు యాక్టర్స్… తెలుగు డైరెక్టర్స్… తెలుగు ప్రొడ్యూసర్స్… వీళ్ళందరూ కేవలం తెలుగు సినిమా నే చేస్తున్నారు అనుకున్నారా??? ఆ కాలం పోయింది… ఇప్పుడు తెలుగు వారి కోసం చాల స్టేట్ సినిమాల వాళ్ళు సినిమాలు చేయాలనీ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ చూస్తున్నాం కదా… లేటెస్ట్ గా రాజమౌళి వారణాసి లో ప్రియాంక చోప్రా హీరోయిన్!
ఇదే చెప్తుంది ఇప్పటి కాలంలో తెలుగు సినిమాకి ఉన్న గ్లోబల్ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో. హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు… అందరి చూపు ఇప్పుడు టాలీవుడ్ మీదే. అలాంటి సమయంలో బాలీవుడ్ నటులు కూడా సౌత్ ఫిల్మ్‌మేకర్లతో కలిసి పని చేయాలని, పెద్ద హిట్లు కొట్టాలని చూస్తున్నారు. 2023లో అట్లీ – షారుక్ ఖాన్ కలిసి జవాన్తో ఇండియానే షేక్ చేశారు. అలాగే రణ్‌బీర్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ Animalతో ఆల్‌టైమ్ హిట్ ఇచ్చింది.

ఇప్పుడు ఇదే లైన్‌లో మరో టాప్ బాలీవుడ్ స్టార్ సౌత్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. SVC ప్రొడ్యూసర్ శిరీష్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం—సల్మాన్ ఖాన్, దిల్ రాజు కాంబినేషన్‌లో 2026లో భారీ బడ్జెట్ సినిమా లాక్ అయ్యింది!
ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ ఎవరో తెలుసా? దిల్ రాజు బ్యానర్‌లో మున్న, బృందావనం, ఎవడు, మహర్షి, వారసుడు వంటి సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి! సల్మాన్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్క్రిప్ట్‌కి ఇప్పటికే ఫైనల్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. షూటింగ్ కూడా 2026లోనే స్టార్ట్ కావొచ్చని టాక్.
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే… దబాంగ్ 3, టైగర్ 3 తప్ప బాక్సాఫీస్‌లో పెద్దగా ప్రభావం చూపిన సినిమాలు ఇటీవలి కాలంలో అతనికి లేవు. AR మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన సికందర్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలే చూసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ బలంగా రీ-బౌన్స్ కావడానికి సల్మాన్, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌నే ఫైనలైజ్ చేశాడు.
వంశీ పైడిపల్లి కూడా గత రెండేళ్లుగా తన స్క్రిప్ట్‌కి సరిపోయే బాలీవుడ్ హీరో కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకసారి ఆమిర్ ఖాన్‌కి స్క్రిప్ట్ వినిపించినా, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. చివరి చిత్రం వారసుడు ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద హిట్ అవసరం ఉన్న సమయంలో… సల్మాన్‌తో భారీ సినిమా అతనికి కీలకం.