Native Async

రవి తేజ కొత్త సినిమా లో హీరోయిన్ ఎవరో తెలుసా???

Ravi Teja’s New Film Heroine Confirmed – Priya Bhavani Shankar Joins “Irumudi” New-Age Thriller
Spread the love

రవితేజా కెరీర్‌లో మళ్లీ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ… ఈసారి మాత్రం ఎప్పటిలాగే లాజిక్ లేని మాస్ సినిమాలు చేయకుండా, కంటెంట్ ఉన్న సినిమాల వైపు తన ఇంటరెస్ట్ ని మళ్ళించాడు.

ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ 2026 సంక్రాంతికి భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో, ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖుషి, మజిలీ, నిన్ను కోరి వంటి భావోద్వేగ కుటుంబ కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి పూర్తిగా తన కంఫర్ట్ జోన్‌ను వదిలి, రవితేజా కెరీర్‌లో ఎప్పుడూ చూడని థ్రిల్లింగ్ షేడ్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సినిమాకు ఇరుముడి అనే యూనిక్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

టైటిల్ వినగానే ఆసక్తిగా మారిన ప్రేక్షకులు—“రవితేజా ఏమి చేయబోతున్నాడు?” అనే ఉత్కంఠలో ఉన్నారు. ఇదే సమయంలో ఫేమ్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా ఎంపిక కావడం మరో ఆకర్షణ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో బ్యాక్ చేయడం మరింత హైప్‌ను పెంచుతోంది. విజ్ఞప్తి సినిమా విడుదలయ్యాకే ఈ థ్రిల్లర్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవల రవితేజాపై వచ్చిన అనేక ట్రోల్స్—“మాస్ సినిమాలకు పరిమితమయ్యాడు”, “స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగ్గా లేదు” అనే విమర్శల తర్వాత… ఈ ఇరుముడి సినిమా ఆయన కెరీర్‌లో మళ్లీ కొత్త టైమ్ మార్చే ప్రాజెక్ట్‌గా అభిమానులు భావిస్తున్నారు. టైటిల్, టెక్నికల్ టీమ్, డైరెక్టర్ విజన్… అన్నీ కలిపి చూస్తే ఈ సినిమా రవితేజాను మరోసారి గేమ్‌లోకి తీసుకొచ్చే పవర్ ఉన్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit