Native Async

బాలయ్య అఖండ 2 రిలీజ్ ఎందుకు పోస్టుపోన్ అయ్యిందంటే???

Why Was Balakrishna’s Akhanda 2 Postponed? The Real Legal Reason Explained
Spread the love

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అలాంటి అఖండ 2 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సడన్ గా వాయిదా పడడం… అది కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జరగడం… ఈ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ట్రేడ్ సర్కిల్స్ అంతా వారం రోజులుగా ఎదురుచూస్తున్న ఈ భారీ రిలీజు ఇలా ఆగిపోవడంతో కాస్త గందరగోళమే ఏర్పడింది.

అసలు ‘అఖండ 2 ‘ కి ఏ సినిమా సంబంధమైన సమస్య లేదు… కానీ ఒక దశాబ్దం క్రితం మొదలైన ఆర్థిక వివాదం ఈరోజు ఇలా సినిమా రిలీజ్ ని పూర్తిగా ఆపేసింది. బాలయ్య–బోయపాటి ల భారీ కాంబినేషన్ తో వచ్చే సినిమాకు ఇలాంటి లీగల్ షాక్ ఎవరూ ఊహించలేదు.

అసలు పది సంవత్సరాల క్రితం మొదలైన కథ ఏంటో తెలుసా??? 2015లో ఆగడు, 1 నేనొక్కడినే సినిమాలు రిలీజ్కా అయిన ఇయర్ లో Eros International ఇంకా 14 Reels Entertainment ఒక ఒప్పందం చేసుకున్నాయి. చెల్లింపులు, పేపర్లు, మరికొన్ని కమిట్మెంట్ల విషయంలో త్వరలోనే వివాదాలు మొదలయ్యాయి. ఆ విషయం ఆర్బిట్రేషన్ వరకు వెళ్లింది.

ఇక 2019లో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది: 14 రీల్స్ కంపెనీ 11 కోట్లకు పైగా అమౌంట్ (ఇంటరెస్ట్ తో) చెల్లించాలి ఇంకా అన్ని టైటిల్ డాక్యుమెంట్స్ Eros కి ఇవ్వాలి, బకాయి క్లియర్ అయ్యే వరకు పాత సినిమాలగానీ, కొత్త సినిమాలగానీ ఒప్పందం కింద వచ్చే ఏ ప్రాజెక్ట్ తోనూ డీల్ చేయరాదు. ఇంకా ఈ ఆర్డర్ ని మద్రాస్ హైకోర్ట్, తర్వాత డివిజన్ బెంచ్, చివరికి సుప్రీం కోర్ట్ కూడా 2021లో అంగీకరించాయి.

కానీ… చెల్లింపు మాత్రం జరగలేదు. దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ కేసు పూర్తిగా ఆలా ఉండిపోయింది అంతే… కానీ 2025లో మళ్ళి ఈ కేసు పైకి వచ్చింది… Eros సంస్థ కి అఖండ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది అని. ఇంకా ఈ చిత్రాన్ని 14 Reels Entertainment కాకుండా 14 Reels Plus LLP తీసుకెళ్తోంది అని కూడా తెలిసి కేసు ని మళ్ళి రి-ఓపెన్ చేసింది.

Eros వాదన ఏమిటంటే:

రెండు సంస్థలు ఒకే వ్యక్తుల చేతిలోనే ఉన్నాయి. సినిమా ను కొత్త LLP కి మార్చడం అంటే పాత బకాయిల నుండి తప్పించుకోవడానికి చేసిన ప్లాన్. దాంతో 2025 ఆగస్టులో లీగల్ నోటీస్ ఇచ్చి, అఖండ 2 విడుదలను ఆపండి అంటూ మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించింది.

ఐతే కోర్ట్ లో వాదనలు ఎలా ఉన్నాయ్ అంటే:
Eros:
LLP అనేది పాత కంపెనీకి మరో రూపం. సినిమా రిలీజ్ అయితే బకాయి రికవరీ అసాధ్యమవుతుంది.

Respondents:
Eros నాలుగేళ్లు ఎలాంటి ప్రాబ్లెమ్ చేయలేదు. కాబట్టి, LLP కి ఆర్బిట్రేషన్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.

మొదటిగా సింగిల్ జడ్జి Eros పిటిషన్స్ ని డిస్మిస్ చేశారు.
అందువల్ల అఖండ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టే అయింది.

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే: Eros అప్పీల్ కి వెళ్లింది. డివిజన్ బెంచ్ తీర్పుని పూర్తిగా సెట్ అసైడ్ చేసి కేసు ని మళ్లీ విచారణకి పంపించింది.

దాంతో:
పూర్తి బకాయి మొత్తం చెల్లించే వరకు అఖండ 2 ని ఎలాంటి రూపంలోనూ విడుదల చేయరాదు, డిస్ట్రిబ్యూట్ చేయరాదు అని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు.

సో, ఇలా సినిమా రిలీజ్ ఆగిపోయింది! సమస్య మొత్తం పాత సినిమాల గురించే. కానీ అఖండ 2 మాత్రం ఈ క్రాస్ ఫైర్ లో చిక్కుకుపోయింది. పాత బకాయి రికవరీ కోసం కొత్త సినిమా ని లీగల్‌గా అడ్డుకోవడం — సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక వివాదాలు ఎంతకాలం వెంబడిస్తాయో మళ్లీ రుజువు చేసింది.

పది సంవత్సరాల క్రితం మొదలైన ఒక బకాయి… ఈరోజు బాలయ్య సినిమా రిలీజ్ ని నిలిపేస్తుందని ఎవరు ఊహిస్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit