ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని సాధించి, స్థానిక పాలన వ్యవస్థకు ఊతం ఇవ్వాలనే ధృడ సంకల్పంతో, గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాంక్షిస్తున్న వికసిత్ భారత్ 2047 సాధనలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శరవేగంగా అడుగులు వేస్తూ ఈరోజు చిత్తూరు వేదికగా ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల (మినీ కలెక్టరేట్) ప్రారంభోత్సవం జరిగాయి. అంతేకాకుండా రెండు దశాబ్దాల తరవాత 10 వేల మంది అధికారులకు అవినీతికి తావు లేకుండా పదోన్నతుల కల్పించారు.
అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మినీ కలెక్టరేట్ తరహాలో డి.డి.ఓ కార్యాలయాల ఏర్పాటు. RDO స్థాయి అధికారితో ఈ కార్యాలయాల పర్యవేక్షణ. ఇంకా ఇకపై కలెక్టరేట్, జిల్లా పరిషత్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా పనిచేయనున్న డిడిఓ కార్యాలయాలు.