మెగాస్టార్ చిరంజీవి – ఈ పేరు ఒక్కటే చాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్ సాంగ్స్, ఎన్ని హుక్ స్టెప్స్… అబ్బో అయన సినిమా వస్తుందట థియేటర్స్ ఫుల్ అవ్వాల్సిందే… ఇక ఇప్పుడు సంక్రాంతి కి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా రాబోతోంది అందుకే ప్రమోషన్స్ తో దుమ్ము రేపుతోంది అనిల్ రావిపూడి టీం…
ఇందాకే సినిమా నుంచి సెకండ్ సాంగ్, “శశిరేఖ…” రిలీజ్ అయ్యింది… అదిరిపోయింది కూడా!
మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ ఇప్పటికే ప్లే లిస్ట్ లో దూసుకుపోతుంటే, రెండో సింగిల్ శశిరేఖ ప్రోమోకే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు మాత్రం… ఫుల్ సాంగ్ రాగానే సోషల్ మీడియా అంతా ఒకటే మాట — “ఇది ప్యూర్ మేజిక్!”
అందుకే అనిల్ రావిపూడి కూడా సాంగ్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, షూటింగ్ టైం లో ని జోయ్ఫుల్ మూమెంట్స్ ని గుర్తుకు తెచ్చుకున్నాడు!
బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్… మొదటి పల్లవి నుంచే హృదయాన్ని తాకే మెలోడీతో మొదలై, కాస్త కాస్తగా ఎనర్జీ పెంచుకుంటూ వెళ్లే అరుదైన కాంపోజిషన్. అనంత శ్రీరామ్ రాసిన పదాలు చిరు–నయనతారల మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ సూపర్ అనిపించింది.
చిరంజీవి స్టైల్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే… అయితే ఈ సాంగ్‌లో ఆయన సంప్రదాయ దుస్తుల్లోనూ, స్టైలిష్ లుక్స్‌లోనూ రెండు లుక్స్ లో అదరగొట్టాడు. నయనతారతో ఆయన కెమిస్ట్రీ కూడా ఈ పాటకు మరో అందం. బీమ్స్, మధు ప్రియా కలిసి పాడిన ఈ పాట అప్పుడే ట్రేండింగ్ లో ఉంది!
దీనికి తోడు భాను మాస్టర్ చేసిన కోరియోగ్రఫీ… ఆహా! మెగాస్టార్ గ్రేస్, ఎనర్జీ ఒకేసారి కలిపినట్టు కనిపించింది. అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్స్ మంత్రముగ్దులను చేస్తున్నాయి.