సందర్శన లో ముఖ్య విషయాలు:
•కనకన కిండి నుంచి మూలవిరాట్ దర్శనం
•పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు… ఆశీర్వచనాలు అందించిన మఠాధిపతులు
•మఠంలోని ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు
•పవన్ కళ్యాణ్ గారికి ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదుని ప్రదానం చేసిన పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ
కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం సందర్శించారు. మఠ సంప్రదాయాలను అనుసరించి ముందుగా కనకదాసులవారి గుడికి వెళ్లి కనకన కిండి నుంచి మూలవిరాట్ ను దర్శించుకున్నారు. అనంతరం మఠంలోని అనంతేశ్వర ఆలయాన్ని సందర్శించి, లింగ రూపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అదృశ్యరూపంలో ఉన్న జగద్గురు శ్రీ మద్వాచార్యులు వారిని దర్శించుకున్నారు.
•పూర్ణకుంభంతో స్వాగతం:
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించడానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మఠంలో వినియోగించే సాంప్రదాయ వాయిద్యాలతో ఆహ్వానించారు. ముందుగా మధ్వసరోవరంలో ప్రోక్షణ చేసుకొని ప్రధాన ఆలయంలోకి విచ్చేసిన శ్రీ పనవ్ కళ్యాణ్ గారికి శ్రీకృష్ణ మఠం పర్యాయ మఠాధిపతి అయిన శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ స్వయంగా దగ్గరుండి శ్రీకృష్ణుడి దర్శనం చేయించారు. కోటి గీతా లేఖన యజ్ఞం సంకల్పాన్ని చేయించారు.
•గీతా మందిరం సందర్శన:
భగవద్గీతను ప్రచారం చేయడానికి, పఠించడానికి వీలుగా నిర్మించిన గీతా మందిరాన్ని శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీతో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. భగవద్గీతలోని ముఖ్యమైన ఘట్టాలు, 700 శ్లోకాలు పఠించడానికి వీలుగా గోడలపై లిఖించారు. లిఖించిన శ్లోకాల సారాన్ని స్వామిజీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
•కుంభాసిలో ప్రత్యేక పూజలు:
ఉడుపి సందర్శన అనంతరం 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుంభాసి అనే పుణ్యక్షేత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. ఈ క్షేత్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆనెగుడ్డె శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి మంగుళూరు చేరుకొని విజయవాడకు పయనమయ్యారు.
అలానే ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ:
•మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అని చెప్పారు!
•తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది
•భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాలి
•సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… ఆధ్యాత్మిక శాస్త్రం
•భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు
•భగవద్గీత… మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి
•పుట్టిగె మఠం చేస్తోంది అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు – సంస్కృతిక, నాగరికతా బాధ్యత