ఇంట్లో తరచుగా గొడవలు రావడానికి వాస్తు ఇలా ఉండటమే కారణమా?

Do Frequent Fights at Home Indicate Vastu Defects? Vastu Tips for Peaceful Family Life

ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయంటే కారణం మాటలు, మనస్తత్వాలకే పరిమితం కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని శక్తుల అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణమై ఉండొచ్చు. ఇంట్లో సానుకూల శక్తి సరిగా ప్రవహించకపోతే చిన్న విషయాలకే పెద్ద వాదనలు, అపోహలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతారు.

ముఖ్యంగా పడకగది దిశ చాలా కీలకం. నైరుతి లేదా వాయువ్య దిశలో ఉండే పడకగది దాంపత్య జీవితానికి శుభకరం. మంచం చెక్కతో చేసిన సింపుల్ దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. మంచం కింద బాక్సులు, పాత వస్తువులు, వ్యర్థాలు పెట్టడం వల్ల ప్రతికూల శక్తి నిలిచిపోతుంది. పడకగదిలో గోడలకు లేత గులాబీ, ఆకుపచ్చ లేదా ఆకాశ నీలం రంగులు వేయడం మనస్సుకు ప్రశాంతతనిస్తుంది.

జంటగా ఉండే వస్తువులు… రెండు దిండ్లు, రెండు ల్యాంపులు, జంట ఫోటోలు – ఐక్యతను సూచిస్తాయి. పగిలిన అద్దాలు, ఒంటరితనం లేదా విషాదాన్ని చూపించే చిత్రాలు గొడవలకు దారి తీస్తాయి. ఇల్లు శుభ్రంగా, క్రమబద్ధంగా, సానుకూలంగా ఉంటే కుటుంబ జీవితం కూడా సహజంగానే ప్రేమతో, సామరస్యంతో సాగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకుంటే ఇంట్లో గొడవలకు దూరంగా ఉండొచ్చు. వాస్తుశాస్త్రం కేవలం శాస్త్రం మాత్రమే కాదు…జీవన విధానాన్ని నిర్ధేశించే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *