తమిళనాడును పాలించిన పల్లవులు..చోళులు ఏమైయ్యారో తెలుసా?

Pallavas and Cholas Untold History of Tamil Nadu’s Ancient Rulers
Spread the love

ఇదేదో యుగానికి ఒక్కడు కథ అనుకుంటే పొరపాటే. చోళరాజులు ఎత్తుకెళ్లిన పాండ్యుల కులదైవం విగ్రహం కోసం ఎన్నో వందల సంవత్సరాల తరువాత పాండ్యుల సంతతికి చెందిన వ్యక్తులు దేశాలు దాటి ప్రాణాలకు తెగించి సాహసాలు చేసి చోళనాయకులను అంతం చేసి కులదైవాన్ని తిరిగి తీసుకొని వస్తారు. పాండ్యులకు సహకరించేందుకు వెళ్లిన ఓ కూలివాడు చోళదూతగా మారడంతో కథ ముగుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది రెండో పార్ట్‌లో చూపించాలని దర్శకనిర్మాతలు అనుకున్న సంగతి తెలిసిందే. రెండో పార్ట్‌ కథను త్వరలోనే తెరకెక్కించనున్నారు. అయితే ఇదంతా కల్పితమైన కథ. కానీ, అసలు పల్లవులు, చోళులు ఏమయ్యారు… వారి పరిపాలన ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాలు నేటికి సందిగ్దంగానే ఉండిపోయాయి.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచిగాని, నేడు పల్నాడుగా చెప్పుకుంటున్న ప్రాంతాల నుంచిగాని ద్రవిడ ప్రాంతానికి వలస వెళ్లారని, అక్కడే కంచిలో పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారని అంటారు. పలు శాసనాల్లో పల్లవులు తమను ఆంధ్రప్రాంతానికి చెందిన వారిగా చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. పల్లవ రాజు పేర్లను పరిశీలించినా ఇది మనకు అవగతం అవుతుంది. ఆయా రాజుల చివర వర్మ అనే ట్యాగ్‌లైన్‌ కనిపిస్తుంది. ఆంధ్రప్రాంతానికి చెందిన క్షత్రీయులు, అగ్నికుల క్షత్రీయులు వారి పేర్ల చివర వర్మ అని పేట్టుకుంటారు. అంతెందుకు తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించిన తొండమాన్‌ చక్రవర్తి కూడా పల్లవుల వారసులే అంటారు. తొండమాన్‌ వారసులు నేటికీ ఉన్నట్టుగా చరిత్రను బట్టి తెలుస్తోంది.

పల్లవుల చరిత్ర ఇలా ఉంటే చోళుల సంగతి మరోలా ఉంది. పల్లవులు ఆగిపోయినట్టుగా చోళులు ఒక్కచోట ఆగిపోలేదు. వారి సామ్రాజ్యాన్ని దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ వ్యాప్తి చెందించారు. శ్రీలంక, వియాత్నం, ఫిలిప్పిన్స్‌, మలేషియా వంటి దేశాల్లో విస్తరించారు. ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్న వారిలో చాలామంది చోళుల వారసులే అయి ఉంటారన్నది వాస్తవం. తమిళనాడులోని పిచ్చవరం పాలైకార్లు చోళుల వారసులని అంటారు. ప్రస్తుతం ఆ వంశంలో మన్నార్‌ సూరప్ప చోళను చోళవంశ వారసుడిగా చెబుతారు. రాజ్యాలు పోయినా వారసత్వం మాత్రమే మిగిలాయి. వారసత్వంగా కొనసాగుతున్న చోళ అనే పేరు తప్ప రాజభోగాలు ఏమీ లేవు. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. కోటలు లేవు మేడలు లేవు… ఆ హంగు ఆర్భాటాలు అసలే లేవు.

For More Stories

Srikalahastiలో అద్భుతం… రాజ్యాన్ని అమ్మవారు ఎలా కాపాడారో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *