ప్రపంచంలో వందేళ్లు దాటిన పెద్దవారి సంఖ్యలో ముందున్న దేశం జపాన్. అక్కడ వృద్ధులు కేవలం బతికే వారే కాదు – ఉత్సాహంగా, ఆనందంగా జీవించే వారే! ఈ అద్భుతమైన దీర్ఘాయుష్కు వెనుక ఐదు సూత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొదటిది “వాషోకు” – ఆహారమే ఔషధం.
జపనీయుల భోజనం ఆరోగ్యానికి మూలం. చేపలు, కూరగాయలు, సోయాబీన్, పులియబెట్టిన ఆహారాలు, తక్కువ మాంసం – ఇవే వారి మెనూ. ప్రాసెస్డ్ చక్కెరలు దాదాపు ఉండవు. కొవ్వులు తక్కువగా ఉండటంతో ఊబకాయం, గుండెజబ్బులు దరిచేరవు.
రెండవది “యుగోకి” – కదలికల మంత్రం.
వారికి జిమ్ అవసరం లేదు. ఇంటి పనులు, నడక, తోటపనులు, చిన్న చిన్న శారీరక కదలికలతోనే వారు శరీరాన్ని చురుకుగా ఉంచుకుంటారు.
ఫిలిప్పిన్స్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ
మూడవది “మోయి” – అనుబంధాల ఆప్యాయత.
ఒకినావా వంటి ప్రాంతాల్లో ప్రజలు చిన్న సమూహాలుగా జీవిస్తారు. ఒకరికి ఒకరు సహాయం చేస్తూ, మానసిక బలం అందిస్తూ ఉంటారు. ఈ స్నేహబంధమే వారిని ఒంటరితనానికి దూరంగా ఉంచి హర్షజీవితానికి నడిపిస్తుంది.
నాలుగవది “ఇకిగాయ్” – అర్థవంతమైన జీవనం.
ప్రతి రోజు మనం ఎందుకు లేస్తున్నామో, జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోవడం ఇదే ఇకిగాయ్. ఎవరి జీవితమూ ఉపయోగకరమనే భావన వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
ఐదవది “నివారణే చికిత్స.”
చికిత్సకన్నా ముందుగా వ్యాధి రాకుండా జాగ్రత్త పడటమే వారి సూత్రం. వార్షిక ఆరోగ్య పరీక్షలు, నియమిత వైద్య పర్యవేక్షణ వల్ల వ్యాధులు మొదటివేళలోనే గుర్తిస్తారు.
ఈ ఐదు సూత్రాలు — ఆహారం, కదలిక, అనుబంధం, అర్థం, నివారణ — ఇవన్నీ కలిసొస్తే వందేళ్లు జీవించడం జపనీయులకే కాదు, మనందరికీ సాధ్యమే. జీవితం పొడవుగా కాకుండా — చురుకుగా, సంతోషంగా సాగిపోవాలంటే ఇదే రహస్యం!