Native Async

ఆకట్టుకుంటున్న హైనెక్‌ ఫ్యాషన్‌

Trending High-Neck Fashion Classic High-Neck Blouses Making a Stylish Comeback
Spread the love

ఈ ఆధునిక ప్రపంచంలో రోజుకో ఫ్యాషన్‌ ట్రెండ్‌ అవుతోంది. ఒకప్పుడు ఆభరణాలు వేసుకోవడానికి వీలుగా జాకెట్‌ నెక్‌ మెడ కిందకు పెట్టేవారు. మెడచుట్టూ పలురకాలైన ఆభరణాలు ధరించడంతో హుందాగా ఉండటంతో పాటు మగువలు అందంగా కనిపించేవారు. వేసుకున్న ఆభరణాలు వారి గొప్పదనాన్ని చాటే విధంగా ఉండేవి. అయితే, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్‌ కూడా మారిపోతున్నది. ఇందులో భాగంగానే హైనెక్‌ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. పాతకాంలో మాదిరిగా మెడచుట్టూ వరకు జాకెట్‌ ఉండటం, ఆ నెక్‌ చుట్టూ ఉన్న బ్లౌజ్‌కు రకరకాల చమ్కీలు, డిజైన్‌లు ఉండటంతో దూరం నుంచి చూసేందుకు ఆభరణాలు ధరించిన ఫీలింగ్‌ కలుగుతుంది. పాతకాలంలో అదరగొట్టిన ఈ హైనెక్‌ బ్లౌజ్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయాయి. సినీతారలు సైతం సినిమా వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ఇలాంటి హైనెక్‌ బ్లౌజులు ధరిస్తున్నారు. దీంతో ఇవి తాజా ప్రపంచంలో సరికొత్త మోడల్స్‌గా దర్శనం ఇస్తున్నాయి.

దుబాయ్‌ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit