విజయనగరం కళలకు రాజధాని, సాంస్కృతిక సంపదకు నిలయం. అలనాటి పూసపాటి రాజ వంశీయుల ఏలిన విజయనగరంలో నృత్యం నేర్చుకున్న చిన్నది అందినంతకెత్తునకు ఎదిగింది. ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ స్థాయి లో పేరు, ప్రఖ్యాతి గడించిన, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులచే పలు కార్యక్రమాలు జరిగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన చేయడం అంటే మామూలు విషయం కాదు.

అందున పట్టుమని పెద్ద వయసు కాని చిన్నారి కేశాప్రగడ ప్రణవి తన భరత నాట్యాన్ని ప్రదర్శించి అటు ఉన్న ఊరుకు, ఇటు కాలు పెట్టిన హైదరాబాద్ రవీంద్ర భారతి, అలాగే సాంస్కృతిక అభిరుచులు కలిగిన సర్వ జనావళికి పేరు తెచ్చి పెట్టింది చిన్నారి ప్రణవి. ఇంతకీ ఈ చిన్నారి ఎవ్వరి గారాల పట్టో చెప్పలేదు కదూ… మహమ్మారి కరోనాను పట్టి పీడిస్తున్న ఉత్తరాంధ్ర ను అందులో విజయనగరంకు కరోనా సేవలు అందించి, రాష్ట్ర స్థాయి లో ఖ్యాతి గడించిన, ప్రస్తుతం రాజాం సీహెచ్సీలో డాక్టర్ గా పని చేస్తున్న డా. కే సుబ్రహ్మణ్యం హరికిషన్, ప్రసన్న దంపతుల ముద్దు బిడ్డ చిన్నారి చిరంజీవి ప్రణవి.