Native Async

ఉత్తరప్రదేశ్‌లో దారుణం… ప్రాచీన శివాలయంపై దాడి

200-year-old Shiva temple vandalized
Spread the love

ఉత్తరప్రదేశ్‌లోని బఘపత్‌ జిల్లాలో అర్థరాత్రి ఘోరమైన ఘనట చేసుకుంది. సుమారు 200 ఏళ్ల ప్రాచీన శివాలయంపై గుర్తుతెలియని గుండగులు దాడి చేశారు. తెల్లవారిజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ ద్వారాలు, శివపార్వతి విగ్రహాలు, గోపురం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆలయంలోని శివలింగానికి ఎలాంటి నష్టం జరగలేదని, దీనిని దైవీకమైన కరుణగా స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో దాడి జరుగుతున్న శబ్ధాలు వినిపించడంతో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తమై పరుగున ఆలయానికి వచ్చారు. దీంతో దుండగులు అక్కడిని పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఆలయంలోని పరిసరాలను ధ్వంసం చేసిన సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గద్దెనెక్కి రెండేళ్లకు చేరువ… జ్వరాలొస్తే మాకు సంబంధం అంటారా….?

రెండు శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ ఆలయంపై దాడి జరగడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానితులను అరెస్ట్‌ చేఇసట్లు అధికారికంగా ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడి యాదృచ్చికం కాదని, పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా యూపీలో ప్రాచీన ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *