హిందూ శాస్త్రాలలో గరుడపురాణం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది కేవలం మరణానంతర జీవితం గురించి మాత్రమే కాకుండా, సజీవుల జీవన విధానం, ధర్మాచరణం, కుటుంబ సౌభాగ్యం వంటి అంశాలపై కూడా మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇందులో శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి “ఉత్తమ సంతానం ఎలా కలుగుతుంది?” అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఎంతో గంభీరమైనది.
గరుడపురాణం 15వ అధ్యాయంలో విష్ణువు ఇలా చెబుతాడు… స్త్రీ, పురుషుల మనస్సు, ఆలోచన, ఆహారం, ప్రవర్తన గర్భధారణ సమయంలో ఎలా ఉంటాయో, జన్మించే సంతానం కూడా అటువంటి గుణాలను పొందుతుందని, స్త్రీ తన రుతుక్రమ సమయంలో సంబంధం పెట్టుకోవడం శాస్త్రవిరుద్ధమని, ఆ కాలంలో శరీర, మనోశుద్ధి ఉండదని పేర్కొంటుంది. ఆ కాలం ముగిసిన తర్వాత, అంటే ఏడవ రోజు నుండి స్త్రీ దేవతారాధనకు, పితృపూజకు అర్హురాలు అవుతుందని, అదే సమయం గర్భధారణకు శ్రేష్ఠమైనదని గరుడపురాణం సూచిస్తుంది.
అర్థరాత్రి ఖాకీల తనిఖీలు… పట్టుబడ్ఠ పాత నేరస్దుడు
అదేవిధంగా, గర్భధారణ సమయంలో మంచి ఆలోచనలు, పవిత్రమైన ఆహారం, భక్తి భావం, దైవస్మరణ ఉన్నప్పుడు పుట్టే సంతానం సద్గుణసంపన్నంగా, ధార్మికంగా, సమాజానికి మేలు చేసేలా ఉంటుందని చెప్పబడింది.
అందువల్ల గరుడపురాణం మనకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది… ఉత్తమ సంతానం కోసం శరీర శుద్ధి కంటే ఎక్కువగా మనస్సు శుద్ధి అవసరం. అది దైవస్ఫూర్తి నుంచి పుట్టే కొత్త జీవితానికి ఆధ్యాత్మిక పునాది అవుతుంది.