గాయత్రి దేవి జయంతి విశిష్టత

Gayatri Devi Jayanti – Importance, Puja Vidhi, and Spiritual Benefits
Spread the love

ఈ రోజు వేదమాత గాయత్రి దేవి జయంతి. పార్వతీదేవికి సొంతమైన ఆత్మసౌందర్యం, సాహసం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం.. కలబోసిన రూపం గాయత్రీ రూపం. మూడు ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి, పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేదవిజ్ఞానానికి, స్త్రీరూప వేద నిధి గాయత్రీ. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి రోజు గాయత్రీ రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రీ మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాలు గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ రోజు భక్తులు గాయత్రీ మంత్ర జపం చేయడం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతు బద్ద విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రీ జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన, దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *