సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం

Kalyanam of Suvarchala Sameta Anjaneya Swamy
Spread the love

పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయస్వామికీ, ఆరవ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవి కి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం,ఇతర పురాణాల ప్రకారం, చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మ వైవర్తపురాణము ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ స్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మ స్థానంలో ఉండే శక్తివంతునికి, స్తీరూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిభందనలు ఉండటంతో, అప్పటికే సూర్యభగవానుడు, హనుమంతుడికి తన కుమార్తె సువర్చలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవడం వలన, ఈ రోజు హనుమంతుని కి వివాహము జరుగుతుంది అని కథనం. అందువలన ఈ రోజు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *