*మహాలయ పక్షాలు* ఈరోజు నుండి ప్రారంభం అవుతాయి. ఈ పక్షం రోజులూ పితృ దేవతలకు శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి ప్రత్యేకించబడిన రోజులు.
ఈరోజు *ప్రతిపత్ శ్రాద్ధం*(అపరాహ్న కాలం లో పాఢ్యమి తిథి ఉన్నందు వలన). ఏ మాసంలో అయినా శుక్లపక్ష,బహుళ పక్ష పాఢ్యమి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. తల్లి వైపు పితరులకు, వారు మరణించిన తిథి తెలియకపోయినా,వారికి శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. ఇలా చేయడం వలన కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి అని విశ్వాసం.