కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని కన్నులారా ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్టేనని భావించేవారు ఎందరో ఉన్నారు. స్వామివారు స్వయంభూవుగా వెలిశారు. అందుకే ఆయనకు అంతటి శక్తి ఉందంటారు. అంతేకాదు, ఈ ఆలయంలోని స్వామివారికి విగ్రహం వెనుక పలు రహస్యాలు కూడా దాగున్నాయి. అందులో ఒకటి స్వామి వారి విగ్రహానికి పెరిగే జుట్టు. విగ్రహం వెనుకభాగంలో జుట్టు నిరంతరం పెరుగుతూనే ఉంటుందట. పెరిగిన జుట్టును కత్తిరించి రహస్యంగా వేలం వేస్తారట. ఇంకో ఆశ్చర్యకరమైన రహస్యం ఏమంటే…తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి స్వామివారికి అవసరమైన పువ్వులు, వెన్న, పాలు, ఇతర వస్తువులను తీసుకొస్తారు.
బయటి వ్యక్తులెవ్వరినీ ఆ గ్రామంలోకి అనుమతించరు. స్వామివారి సేవ కోసమే అక్కడి ప్రజలు నివశిస్తుంటారు. ఆ గ్రామంలో నివశించేవారికి తప్పించి మరెవ్వరికీ తిరుమలకు వెళ్లే వస్తువల గురించి తెలియదని పండితులు చెబుతున్నారు. ఈ విగ్రహంలో మరో అద్భుతం కూడా దాగుంది. విగ్రహం వెనుక చెవులు పెట్టి వింటే అలల శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని స్వామివారి గర్భాలయం వెనుక నుంచి కూడా వినొచ్చు. కానీ, ఈ శబ్దం అందరికీ వినిపించదు. ఎంతో పుణ్యం చేసుకున్నవాళ్లకే వినిపిస్తుందని పండితులు చెబుతున్నారు. స్వామివారి విగ్రహంలో ఉన్న మరో అద్భుత రహస్యం… స్వామివారి నిలువెత్తు రూపం వెనుకభాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎంత తుడిచినా తడి ఆరదు. ఎందుకు ఇలా ఉంటుంది అన్నది ఇప్పటికీ రహస్యమే.