ఉత్తరాంథ్ర కలవల్లి విజయనగరం శ్రీశ్రీశ్రీ పైడితల్లి…!
అమ్మవారి మాల దీక్ష.. ఉత్సవాలకు అంకురార్పణ..!
కూటమి ఎమ్మెల్యే ఆదితీ చేతలు మీదుగా పందిరరాట ప్రారంభం.
విజయనగరం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవాలకు అంకురార్పణ, ఆపై పందిరరాట వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. కూటమి విజయనగరం ఎమ్మెల్యే, ఆలయ అనువంశిక ధర్మకర్త బిడ్డ అయిన ఆదితీ చేతుల మీదుగా శుక్రవారం నగరంలో ని చదురగుడి వద్ద ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల నడుమ, ఆలయపూజారి బంటుపల్లి వెంకటరమణ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుము అత్యంత వైభవోపేతంగా అమ్మవారి సిరిమాను ఉత్సవాలు షురూ అయ్యాయి.
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే ఆదితీ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఈ రోజు నుంచే మొదలయ్యాయన్నారు. నాన్న గారి కల సాకారం అవుతోందని, ఈ అమ్మవారి ఉత్సవాలలో రాజకీయం లేకుండా అందరూ, సమిష్టిగా పని చేస్తున్నామన్నారు. అంతకు ముందు ఆలయ ఈఓ శిరీష మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, వచ్చే నెల, ఆరున తొలేళ్లు, ఏడున సిరిమాను ఉత్సవం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ ఆస్థాన పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడాతు అమ్మవారి కృపకు ప్రతీ ఒక్కరూ పాత్రులు కావలెనని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగరం వన్ టౌన్, టూటౌన్ సీఐలు ఆర్వీకే. చౌదరి, శ్రీనివాస్ లు తమ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహించారు.