Temple Lion Gates
ఆలయంలోకి ప్రవేశించిన తరువాత సింహద్వారం మనకు కనిపిస్తుంది. ఈ ద్వారం గుండానే లోనికి ప్రవేశిస్తాం. సింహద్వారం అనే పదం హిందూ, జైన, బౌద్ధ సంప్రదాయాల్లో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సింహద్వారాలు ప్రధానంగా దేవాలయాలు, మందిరాలు, పవిత్రమైన ప్రదేశాల ప్రవేశద్వారాన్ని సూచిస్తుంది. ఈ ద్వారాలను సింహద్వారాలు అని పిలవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయి. హైందవ సంప్రదాయంలో సింహం ఒక శక్తివంతమైన జంతువు. ధైర్యానికి, విజయానికి సంకేతం. రాజస్వభావాన్ని సూచిస్తుంది. దేవాలయాలకు ముందు సింహం విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి.
దేశవ్యాప్తంగా మోదీ మానియా… నెహ్రూ రికార్డులు బ్రేక్
వీటిని ఇక్కడ అమర్చడం ద్వారా అది పవిత్రమైన స్థలంగా చెప్పబడుతుంది. దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ సింహాలు అడ్డుకుంటాయి. సింహం దుర్గా, పార్వతీదేవికి మాత్రమే కాదు లక్ష్మీదేవికి కూడా వాహనమేనని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. సింహవాహినిగా ఉండటం వలనే ధనం, శాంతి నిలిచి ఉందని అంటారు. దుర్గాదవిని మహిషాసుర మర్దినిగా చెబుతారు. సింహం వాహనంగా ఉండటం వలనే విజయం లభించిందని పండితులు చెబుతున్నారు. దైవిక శక్తులకు చిహ్నంగా, రక్షణగా ఉంటుంది కాబట్టే పవిత్రమైన ప్రవేశాల ద్వారాలను సింహద్వారమని పిలుస్తారు.